నందమూరి బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్‌కు షాకిచ్చిన బ్యాంక్. ఆస్తుల జప్తు నోటీసులు జారీ.. గతంలో పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో.. తాకట్టు పెట్టిన భూములు జప్తు చేస్తామన్న
బాలయ్య చిన్నల్లుడు భరత్‌కు షాక్
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్‌కు బ్యాంక్ షాకిచ్చింది. రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు పంపించింది.. నోటీసులకు శ్రీభరత్ స్పందించకపోవడంతో ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమయ్యింది. గతంలో హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్‌లో గాజువాక, భీమిలిలోని భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ ఆస్తుల జప్తుకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు ఇచ్చింద
గతంలో కూడా శ్రీభరత్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బాలయ్య చిన్నల్లుడి కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందన్నారు. చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
శ్రీభరత్ కూడా విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థకు ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావాలని.. తాము కూడా ఆర్థికంగా ఇబ్బందిపడుతన్నామని.. అందుకే బ్యాంకులకు డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నామన్నారు. తాను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం సరికాదని.. ఇలాంటి ఆరోపణలు సరికావన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్తులు జప్తుకు రావడం ఆసక్తికరంగా మారింది.

ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి